: ఒకడు అత్యాచారం చేశాడు... అది చూస్తూ ఇంకొకడు ఎంజాయ్ చేశాడు... ఆమె కాల్చుకుంది!


ఒకడు అత్యాచారం చేశాడు. దానిని కిటికీలోంచి చూస్తూ వాడి మిత్రుడు ఎంజాయ్ చేశాడు. ఆ అవమాన భారం భరించలేని ఆ యువతి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని తనకు తానే శిక్ష వేసుకుని చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. రాజస్థాన్ లోని జైపూర్ లోని ఓ ఇంట్లో మనీష్ (25) అద్దెకు ఉంటున్నాడు. అదే భవనంలో ఉండే యువతిపై మనీష్ కన్నేశాడు. ఆ యువతి తల్లిదండ్రులు పనిమీద బయటకు వెళ్లగా, ఒంటరిగా ఉన్న యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మనీష్ అత్యాచారం చేస్తుండగా, అతని స్నేహితుడు రాజేంద్ర కిటికీలోంచి చూస్తూ ఆనందించాడు.

అత్యాచార అవమానభారం భరించలేని ఆ యువతి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటలు తాళలేక ఆమె పెట్టిన కేకలు విన్న ఇరుగుపొరుగువారు వచ్చి మంటలు ఆర్పి ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆమె వద్ద ఏసీపీ ప్రేమ్ దత్ రతన్ వాంగ్మూలం తీసుకుని, నిందితులు మనీష్, రాజేంద్రను అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News