: ఫేస్ బుక్ లో విద్వేషం ప్రాణం తీసింది
ఓ ఐటీ ఉద్యోగి ఫేస్ బుక్ లో పెట్టిన ఫొటోలు చివరికి అతడి ప్రాణాలు పోవడానికి కారణమయ్యాయి. పూణెకు చెందిన 28 ఏళ్ల షేక్ మొహసిన్ సాదిక్... ఛత్రపతి శివాజీ, దివంగత శివసేనాధిపతి బాల్ ఠాక్రేలను అవమానించేలా ఉన్న ఫొటోలను ఫేస్ బుక్ లో పెట్టాడు. దీంతో కొందరు అతడిపై కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో సాదిక్ గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణం విడిచాడు. ఈ కేసులో పోలీసులు 13 మందిని అరెస్ట్ చేశారు. వీరు హిందూ రాష్ట్ర సేనకు చెందిన వారని భావిస్తున్నారు.