: టీఆర్ఎస్ ప్రభుత్వంపై రైతన్న కన్నెర్ర... జెండా దిమ్మెలు కూల్చివేత


టీఆర్ఎస్ ప్రభుత్వంపై రైతన్నలు భగ్గుమన్నారు. రుణమాఫీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వ ఆంక్షలపై మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మంథని, గాంధారి మండలం మాతుసంగంలో టీఆర్ఎస్ జెండా దిమ్మెలను కూల్చివేశారు. తాడ్వాయి, గాంధారిలలో రాస్తారోకో నిర్వహిస్తున్నారు. కేవలం ఫ్రెష్ లోన్లకు మాత్రమే రుణ మాఫీ వర్తిస్తుందని, లక్ష వరకు మాత్రమే రుణ మాఫీ ఉంటుందని, సాగు తర్వాత తీసుకున్న లోన్లకు మాఫీ వర్తించదని నిన్న తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News