: అంధ విద్యార్థినులపై లైంగిక వేధింపులు
వారంతా అంధ విద్యార్థినులు. లోకంలో కుళ్లు, కీచకుల గురించి ఏ మాత్రం తెలియదు. దేవుడు చూపునివ్వకపోయినా.. కష్టపడి విద్యను అభ్యసిస్తున్నారు. కానీ వారిపై ఓ కీచకుడి చూపు పడింది. వరంగల్ జిల్లా హన్మకొండలోని స్పేస్ బ్లైండ్ స్కూల్ నిర్వాహకురాలి భర్తే అంధ విద్యార్థినులను లైంగికంగా వేధించడం మొదలు పెట్టాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు రావడంతో నిర్వాహకురాలు భర్త భాస్కర్ ను అరెస్ట్ చేశారు.