: యూపీ దారుణాలపై మోడీని ప్రశ్నించరేం?: దిగ్విజయ్
కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ మీడియాపై తన అక్కసును మరోసారి వెళ్లగక్కారు. నిర్భయ అత్యాచార ఘటన విషయంలో అప్పటి ప్రధాని మన్మోహన్ ను తూర్పారబట్టిన మీడియా... యూపీలో వరుసగా జరుగుతున్న అత్యాచార ఘటనలపై ప్రస్తుత ప్రధాని మోడీని ఎందుకు ప్రశ్నించడం లేదని మీడియాను నిలదీశారు. మీడియా పక్షపాత వైఖరితో వ్యవహరిస్తోందంటూ ఆయన మండిపడ్డారు.