: ఎట్టకేలకు అమెరికాలో అడుగుపెట్టనున్న మోడీ


నరేంద్రమోడీ ఎట్టకేలకు భారత ప్రధానిగా అమెరికాలో అడుగుపెట్టబోతున్నారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సమావేశాల్లో పాల్గొనేందుకు ఈ ఏడాది సెప్టెంబర్లో మోడీ అమెరికాకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగానే అధ్యక్షుడు ఒబామాతో భేటీ అయి ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరపాలని మోడీ నిర్ణయించుకున్నారు. సెప్టెంబర్ నెల చివరి వారంలో ఇరువురికీ అనుకూలమైన తేదీని అధికారులు ఖరారు చేయనున్నారు.

2002లో గుజరాత్ అల్లర్ల తర్వాత మోడీ వీసాపై జార్జ్ బుష్ సర్కారు నిషేధం విధించింది. ఆ తర్వాత మోడీ అమెరికాకు ఒక్కసారి కూడా వెళ్లలేదు. అయితే, బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోడీ ఎంపికైన తర్వాత అమెరికా విధానంలో మార్పు చోటు చేసుకుంది. లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో మోడీకి ఒబామా ఫోన్ చేసి అభినందనలు తెలియజేయడమే కాకుండా, అమెరికాకు రావాలని ఆహ్వానించారు.

  • Loading...

More Telugu News