: గవర్నర్ ను కలవనున్న ఏపీ టీడీపీ శాసనసభాపక్షం
గవర్నర్ నరసింహన్ ను ఈ మధ్యాహ్నం 12.30 గంటలకు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం శాసనసభాపక్షం కలవనుంది. పార్టీ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్న తీర్మానాన్ని వారు గవర్నర్ కు అందజేయనున్నారు. కాగా, ఈ నెల 8న పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే.