: ముంపు గ్రామాలను తెలంగాణలోనే ఉంచాలి: కేంద్ర హోం మంత్రికి తెలంగాణా బీజేపీ నేతల విజ్ఞప్తి


కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మరో నేత నాగం జనార్ధన్ రెడ్డి ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణకు సంబంధించిన పలు సమస్యలపై రాజ్ నాథ్ తో వారు చర్చించారు. పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలను ఏపీలో కలపరాదని... తెలంగాణలోనే ఉంచాలని కోరారు. తెలంగాణ కూడా ఎన్నో రంగాల్లో వెనుకబడి ఉందని... సీమాంధ్రతో సమానంగా తెలంగాణకు కూడా నిధులను కేటాయించాలని ఈ సందర్భంగా కోరారు. తమ విజ్ఞప్తికి రాజ్ నాథ్ సానుకూలంగా స్పందించారని కిషన్, నాగం తెలిపారు.

  • Loading...

More Telugu News