: ఏయ్... ఏంటిది... తప్పు: బాలకృష్ణ


టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ ఈ ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపలకు వచ్చిన బాలయ్యకు పలువురు అభినందనలు తెలిపారు. పుష్పగుచ్ఛాలను అందించారు. ఈ సమయంలో ఓ వ్యక్తి బాలకృష్ణకు పాదాభివందనం చేయబోయాడు. ఇంతలో తేరుకున్న బాలయ్య... "ఏయ్... ఏంటిది?... తప్పు" అని వారించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రెండు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా, సుఖసంతోషాలతో ఉండాలని స్వామి వారిని కోరుకున్నానని చెప్పారు.

  • Loading...

More Telugu News