: హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాయిని
తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రిగా నాయిని నర్సింహారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ భద్రతకు పెద్దపీట వేస్తామని చెప్పారు. అడుగడుగునా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి భద్రతను పర్యవేక్షిస్తామని తెలిపారు. అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే ఉద్యమకారులపై కేసులను ఎత్తివేస్తామని చెప్పారు. హైదరాబాదులో సీమాంధ్రులకు పూర్తి రక్షణ కల్పిస్తామని వెల్లడించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించమని తెలిపారు.