: ఆరోగ్యశ్రీ వరప్రదాయని కాదు : డీఎల్
వైద్య శాఖ మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఆరోగ్యశ్రీ పథకం గురించి ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పథకం వరప్రదాయని కాదన్నారు. ఆరోగ్యశ్రీ పథకం వల్ల లాభపడేది ప్రజలకంటే ప్రయివేటు ఆసుపత్రులే అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాసుపత్రుల్లో అత్యంత నిఫుణులైన వైద్యులున్నారని వారి సేవలు మరింతగా ఉపయోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వాసుపత్రులను అభివృద్ధి చేస్తే అందరికీ నాణ్యమైన వైద్యం అందుతుందని డీఎల్ అభిప్రాయపడ్డారు. ఆరోగ్యశ్రీ సేవలందిస్తోన్న ఆసుపత్రి యాజమాన్యాలు తమ సేవల రుసుము పెంచాలని డిమాండ్ చేసిన నేపథ్యంలోఇటీవలే వీరికి బాసటగా డీఎల్ స్పందించిన సంగతి తెలిసిందే.