: శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిన్న రాత్రి ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారితో కలసి ఆయన స్వామి వారి సేవలో పాల్గొన్నారు. సినీనటుడు, హిందూపురం శాసనసభ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన బాలకృష్ణ తిరుమలేశుని తిరుప్పావడ సేవలో పాల్గొన్నారు.