: బ్రెజిల్ ఆటగాళ్ల కోసం ప్రత్యేక 'బొమ్మల' విమానం
భారతీయులు క్రికెట్ ను ఎలా మతంలా భావిస్తారో...బ్రెజిల్ దేశీయులు ఫుట్ బాల్ ను అంతలా ఆరాధిస్తారు. అందుకే, ఫుట్ బాల్ ఆటపై తమకున్న అభిమానాన్ని బ్రెజిల్ ప్రత్యేకంగా చాటుకుంది. జూన్ 12 ప్రారంభం కానున్న ప్రపంచకప్ ఫుట్ బాల్ పోటీలకు ఆతిథ్యమిస్తున్న బ్రెజిల్ తమ జాతీయ జట్టు ప్రయాణించేందుకు ప్రత్యేక విమానం రూపొందించింది. బోయింగ్ 737 విమానంపై గ్రాఫిటీ డిజైన్లతో అందంగా బొమ్మలు వేశారు.
బ్రెజిల్ లో పేరెన్నిక గన్న గ్రాఫిటీ చిత్రకారులు ఆక్టావియో, గస్టావోల ఆలోచనలకు అనుగుణంగా, బ్రెజిల్ విమాన సర్వీసు సంస్థ జీఓఎల్ అంగీకారంతో, వీరిద్దరూ దాదాపు 1200 స్ప్రే క్యాన్లతో విమానానికి రంగులద్దారు. విమానానికి వేసిన రంగులు తమ దేశీయుల కలలను ప్రతిబింబిస్తాయని వారు పేర్కొన్నారు.