: విశాఖ నావికాదళం అమ్ములపొదిలో ఐయస్వీ బోట్లు
తూర్పు నౌకాదళం అమ్ములపొదిలో సరికొత్త బోట్లు వచ్చి చేరుతున్నాయి. ఓఎన్జీసీ ఆర్ధిక సహాయంతో తక్షణ సహాయక బోట్లను సమకూర్చారు. ఐఎస్వీ బోట్లలను అబుదాబి షిప్ బిల్డింగ్ నిర్మిస్తోంది. మొత్తం 23 ఐఎస్వీ తరహా బోట్లను భారత్ కోసం సిద్ధం చేస్తుండగా, వీటిలో 9 బోట్లను తూర్పు నౌకాదళానికి కేటాయించారు. వాటిలో మూడు ఐఎస్వీ బోట్లు విశాఖ చేరుకున్నాయి. నౌకాదళ సిబ్బందితో బాటు మత్స్యకారులు ప్రమాదంలో పడినప్పుడు అత్యవసర సేవలు అందించేందుకు వీటిని వినియోగించనున్నారు. తీర ప్రాంతంలో గస్తీ కోసం కూడా వీటిని వినియోగిస్తారు.