: సీట్ బెల్టు పెట్టుకుని ఉంటే నా స్నేహితుడు బతికి ఉండేవాడు: హర్షవర్థన్


సీట్ బెల్టు పెట్టుకుని ఉంటే కేంద్ర మంత్రి, దివంగత గోపీనాథ్ ముండే బతికి ఉండేవారని కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్థన్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, సీట్ బెల్టు ప్రాణాలు కాపాడుతుందా? అనే భావన తన మిత్రుడి ప్రాణాలు తీసిందని అన్నారు. కారు సీటుకుండే బెల్టు అలంకారప్రాయం అనే భావన చాలా మందిలో ఉండడం దురదృష్టకరమని ఆయన తెలిపారు. సీట్ బెల్టు పెట్టుకోవడం ద్వారా ప్రమాదాల నుంచి ప్రాణాలతో బయటపడొచ్చని ఆయన చెప్పారు. సీట్ బెల్టు పెట్టుకోని కారణంగా ఎర్రన్నాయుడు, శోభానాగిరెడ్డి, లాల్ జాన్ భాషా వంటి నేతలు మృతి చెందిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News