: బాబు అదనంగా 60 వేల కోట్లు తేవాలి: శైలజానాథ్
ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి అదనంగా 60 వేల కోట్ల రూపాయల నిధులు తిసుకురావాలని మాజీ మంత్రి శైలాజానాథ్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని అన్నారు. పదేళ్ల ఉమ్మడి రాజధానిగా నిర్దేశించిన హైదరాబాదుకు స్వయం ప్రతిపత్తి కలిగేలా చూడాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పోలవరం వివాదం సమసిపోవాలంటే భద్రాచలం డివిజన్ ను ఆంధ్రప్రదేశ్ లో కలపాలని సూచించారు.