: జయలలిత తీరుపై ముక్కున వేలేసుకుంటున్న రాజకీయనాయకులు


పురచ్చి తలైవి జయలలితకు హంగూ ఆర్భాటాలకు తిరుగులేదు. ఆమె అడుగు బయటపెట్టారంటే వందిమాగధులు అడుగులకు మడుగులొత్తాల్సిందే. చూసేందుకు సింపుల్ గా కనపడినా, తమిళనాడు ముఖ్యమంత్రిగా దర్పాన్ని ప్రదర్శించడంలో ఆమెను మించిన వారు లేరంటే అతిశయోక్తి కాదు. తాజాగా ఆమె ఢిల్లీ పర్యటన ఓ వివాదాన్ని రాజేసింది. అమెరికా అధ్యక్షుడు ఏదయినా దేశం వెళ్తే తాను ప్రయాణించే కారు సహా అన్నిటినీ అధ్యక్ష విమానం 'ఎయిర్ ఫోర్స్ వన్'లో తన వెంటతీసుకెళ్తాడన్న విషయం అందరికీ తెలిసిందే.

అదే మాదిరిగా తమిళనాడు ముఖ్యమంత్రి తన సింహాసనాన్ని ఢిల్లీకి మోసుకెళ్లారు. కేంద్ర మంత్రి ఆరుణ్ జైట్లీతో సమావేశం సందర్భంగా ఆమె ప్రత్యేక కుర్చీ తెప్పించుకున్నారు. భేటీ అనంతరం భద్రతాధికారి ఆ కుర్చీని జాగ్రత్తగా మోసుకెళ్లారు. దీంతో జయలలిత తీరు రాచరికపు రోజుల్ని గుర్తు తెస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News