: అత్యాచారం జరగనివ్వలేదని...అసాల్ట్ రైఫిల్ తో కాల్చేశారు


మేఘాలయలో దారుణం చోటుచేసుకుంది. అత్యాచారం జరగకుండా అడ్డుకుంటోందని ఓ మహిళను జీఎన్ఎల్ఏ ఉగ్రవాదులు పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చేశారు. దక్షిణ గారో హిల్స్ జిల్లాలోని రాజారోంగట్ ప్రాంతంలో ఐదుగురు సాయుధులైన ఉగ్రవాదులు ఓ ఇంట్లో చొరబడ్డారు. భర్త, ఐదుగురు పిల్లలను ఓ గదిలో పెట్టి తాళం వేసి మహిళను బయటకు లాక్కొచ్చారు.

ఆమెపై దాడి చేసి వేధించారు. అత్యాచారం చేసేందుకు ప్రయత్నించగా, వారి ప్రయత్నాన్ని ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో, ఆటోమేటిక్ అసాల్ట్ రైఫిల్ తో పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చేశారు. దాంతో ఆమె తల రెండు చెక్కలైపోయిందని ఐజీ (ఆపరేషన్స్) జీహెచ్ పీ రాజు తెలిపారు. దీనిపై ఆ ప్రాంత ఎంపీ పీఏ సంగ్మా ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతలు పరిరక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన మండిపడ్డారు.

  • Loading...

More Telugu News