: ముండే చితికి నిప్పంటించిన కుమార్తె
కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే అంత్యక్రియలు పూర్తయ్యాయి. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలోని పర్లీలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు ఘనంగా నిర్వహించారు. ముండేకు కుమారులు లేకపోవడంతో ఆయన పెద్ద కుమార్తె పంకజ అంతిమ సంస్కారం పూర్తి చేశారు. శోకతప్త హృదయంతో ఆమె తండ్రి చితికి నిప్పంటించారు. తమ అభిమాన నేతను కడసారి దర్శించుకునేందుకు బీజేపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బీజేపీ అధ్యక్షుడు రాజనాథ్ సింగ్, పలువురు కేంద్ర మంత్రులు ముండే అంత్యక్రియలకు హాజరయ్యారు.