: యూపీ ముఖ్యమంత్రి సిగ్గుపడాలి: నిర్మలా సీతారామన్
ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న అత్యాచారాలను అదుపుచేయాల్సిన ముఖ్యమంత్రి, తన విధులను గాలికొదిలేసి, దేశవ్యాప్తంగా అత్యాచారాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించడం సిగ్గుచేటని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఆమె మాట్లాడుతూ, బహిర్భూమికి వెళ్లిన అమ్మాయిలపైన, మేకలు మేపుకునేందుకు వెళ్లిన పిల్లలపైన, పాఠశాలకు వెళ్తున్న అమ్మాయిలపైనే కాకుండా ఇళ్లలో చొరబడి కూడా యధేచ్చగా అత్యాచారాలు జరుగుతుంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని ఆమె నిలదీశారు.
బాధ్యతలు గాలికొదిలేసి లేనిపోని నిందలు వేయడం సరికాదని, సమస్యను పరిష్కరించడం అత్యవసరమని ఆమె సూచించారు. తక్షణం పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.