: అత్యాచారాలు ఉత్తరప్రదేశ్ లోనే కాదు...దేశంలో చాలా చోట్ల జరుగుతున్నాయి: అఖిలేష్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అత్యాచార ఘటనలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. లక్నోలో ఆయన మాట్లాడుతూ అత్యాచారాలు కేవలం ఉత్తరప్రదేశ్ లోనే జరగడం లేదని... దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని అన్నారు. ఎవరికైనా అనుమానముంటే గూగుల్ లో వెతుక్కోవాలని ఆయన సూచించారు. అత్యాచారాలపై బీజేపీ అనవసర రాద్దాంతం చేస్తోందని ఆయన మండిపడ్డారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. యూపీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది.