: రాజమండ్రిలో జగన్... ఎన్నికల ఫలితాలపై సమీక్ష షురూ!
వైఎస్సార్సీపీ అధినేత జగన్ రాజమండ్రిలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గాల ఫలితాలపై సమీక్ష జరుపుతున్నారు. ముందుగా తూర్పుగోదావరి జిల్లాలోని అసెంబ్లీ నియోజవర్గాల ఫలితాలపై విశ్లేషణ చేస్తున్నారు. ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలపై నేడు సమీక్ష జరుగుతుంది. పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలోని ముఖ్యనేతలతో సమావేశాలు నిర్వహించి, పార్టీ పరిస్థితిపై చర్చిస్తారు.
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, బలమైన, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించేందుకు జగన్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే జిల్లాల్లో పార్టీ పరిస్థితి తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాలను పంపి నివేదికలు తెప్పించుకున్న జగన్, క్యాడర్ ను ఉత్తేజపరిచేందుకు కార్యాచరణ రచించనున్నారు. మూడు రోజులపాటు ఈ సమీక్షలు కొనసాగనున్నాయి.