: కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ ఇవాళ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కలెక్టర్ ప్రతి వార్డును పరిశీలిస్తూ, ఆసుపత్రిలో నెలకొన్న సమస్యల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. సకాలంలో వైద్య సేవలు అందించాలని ఆమె వైద్యులకు సూచించారు. ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఆమె అధికారులకు చెప్పారు.