: పన్ను రాయితీ రెండు రాష్ట్రాలకూ వర్తిస్తుంది: ఎంపీ వినోద్


కేంద్రం ఇచ్చే పన్ను రాయితీ రెండు రాష్ట్రాలకు వర్తిస్తుందని కరీంనగర్ ఎంపీ వినోద్ అన్నారు. ఈ విషయం రాష్ట్ర ఏర్పాటు బిల్లులోనే స్పష్టంగా ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే పన్ను రాయితీ అనేది అవాస్తవమన్నారు. ఈ అంశంలో పారిశ్రామిక వేత్తలు అపోహలకు పోవద్దని సూచించారు. కాగా, ఈ నెల 30 వరకు తెలంగాణ వాహనాలకు పన్ను మినహాయింపు ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News