: సచిన్ ఓడితే ముంబై ఇండియన్స్ గెలిచినట్లే!


మరోసారి అభిమానులను సచిన్ చాలా నిరాశపరిచాడు. శనివారం చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో సచిన్ టెండుల్కర్ డకౌట్ అయ్యాడు. అదేమోగానీ తాను ఓడినా తన జట్టు ముంబై ఇండియన్స్ విజయం సాధించడంతో సచిన్ మాత్రం లోలోపల ఆనంద పడ్డాడు. ఎందుకంటే తాను ఓడితే జట్టు గెలుస్తుంది మరి!

సూపర్ కింగ్స్ పై ముంబై ఇండియన్స్ కు ఇదే తొలి విజయం. శనివారం జరిగిన ఆటలో సచిన్ ఒక్క పరుగూ చేయకుండా డకౌట్ అయ్యాడు. ఇలా ఐపీఎల్ లో సచిన్ డకౌట్ కావడం ఇది నాలుగోసారి. అదేం చిత్రమో గానీ సచిన్ డకౌట్ అయితే జట్టుకు కలిసి వస్తుందేమో. సచిన్ డకౌట్ అయిన ప్రతీసారీ ముంబై ఇండియన్స్ గెలుస్తూనే ఉంది. ఇలా నాలుగు విజయాలనూ సొంతం చేసుకుంది. మరి సచిన్ డౌకౌట్ కు జట్టు విజయానికీ ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్లుంది!

  • Loading...

More Telugu News