: హైదరాబాదులో నంబర్ ప్లేట్ స్పెషల్ డ్రైవ్ వాయిదా: ట్రాఫిక్ పోలీసులు


హైదరాబాదులో ఇవాళ్టి నుంచి జరగాల్సిన వాహనాల నంబర్ ప్లేట్ల స్పెషల్ డ్రైవ్ వాయిదా పడింది. ఈ నెల 9 నుంచి ఈ స్పెషల్ డ్రైవ్ ను చేపట్టనున్నట్లు ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ జితేందర్ చెప్పారు. ఈ డ్రైవ్ లో ఆర్టీఏ నిబంధనల ప్రకారం నంబర్ ప్లేట్లు ఉన్నాయా, లేదా పరిశీలిస్తారు. అలాగే నెంబర్ ప్లేట్లపై పోలీస్, ఆర్మీ, మీడియా అని ఉంటే జరిమానా విధిస్తామని ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ చెప్పారు. రూ. 50 నుంచి రూ.200 వరకు జరిమానా విధిస్తామన్నారు.

  • Loading...

More Telugu News