: స్వగ్రామానికి చేరిన గోపీనాథ్ ముండే మృతదేహం
కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే మృతదేహం మహారాష్ట్రలోని లాతూరుకు సమీపంలోని పర్లి గ్రామానికి చేరుకుంది. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రత్యేక హెలికాప్టర్లో ఢిల్లీ నుంచి లాతూరుకు ముండే పార్ధివ దేహాన్ని తరలించారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో స్వగ్రామానికి తీసుకెళ్లారు. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్, బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ తదితరులు పర్లికి చేరుకున్నారు. కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, అనంతకుమార్, శివసేనాధినేత ఉద్దవ్ ఠాక్రే తదితరులు కూడా ముండే అంత్యక్రియలకు హాజరుకానున్నారు. గోపీనాథ్ ముండేకి ముగ్గురు కుమార్తెలు. చిన్న కుమార్తె పంకజ (బీజేపీ ఎమ్మెల్యే) తండ్రి పార్ధివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.