: వారిని ఢీకొనడం కేసీఆర్ కే సాధ్యం: కేటీఆర్


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడితో ఢీకొనడం ముఖ్యమంత్రి కేసీఆర్ కే సాధ్యమని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. తాను, హరీశ్ రావు దొడ్డిదారిలో మంత్రులం కాలేదని, తెలంగాణ కోసం ఉద్యమంలో ముందుండి పోరాడమని, అందుకే తమను ప్రజలు గెలిపించారని ఆయన చెప్పారు. విమర్శకులకు తమ పనితీరుతోనే సమాధానం చెబుతామన్నారు. మంత్రివర్గ విస్తరణలో అన్ని వర్గాలకు న్యాయం చేకూరుతుందని చెప్పారు.

  • Loading...

More Telugu News