: బ్యాంకర్లతో సమావేశమైన తెలంగాణ సీఎం కేసీఆర్
హైదరాబాదులోని సచివాలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బ్యాంకర్లతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన రుణమాఫీ హామీకి సంబంధించి ప్రధానంగా కేసీఆర్ బ్యాంకర్లతో చర్చిస్తున్నారు. రైతులకు లక్ష రూపాయల లోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తానని కేసీఆర్ ఎన్నికల్లో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, తెలంగాణలో రైతులకు ఉన్న లక్ష రూపాయల లోపు ఉన్న రుణాలు, వ్యవసాయ రుణాలు, అందులో రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న బంగారం రుణాలు ఎంత ఉన్నాయి? వంటి లెక్కలతో బ్యాంకర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు.