: ఇవాళ టీడీఎల్పీ నేతగా చంద్రబాబు ఎన్నిక
తిరుపతిలో ఇవాళ సాయంత్రం తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో టీడీఎల్పీ నేతగా చంద్రబాబును ఎన్నుకుంటారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ సెనెట్ హాల్ లో నిర్వహిస్తున్న ఈ సమావేశం కోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఈ భేటీకి హాజరయ్యేందుకు ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలు తిరుపతికి చేరుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యాహ్నానికి తిరుపతి చేరుకుంటారు.