: పడవ మునక ఘటనలో మరో ఇద్దరి మృతదేహాలు లభ్యం
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని ధవళేశ్వరం సున్నపుబట్టీ రేవులో నాటు పడవ బోల్తా పడిన సంగతి తెలిసిందే. భారీ ఈదురుగాలుల ధాటికి పడవ బోల్తా పడిన ఘటనలో ఐదుగురు మరణించగా, ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇవాళ మరో రెండు మృతదేహాలను వెలికితీశారు. మృతులను మల్లేశ్వరి, సత్య, జ్యోతి, రాజేశ్వరి, శివన్నారాయణగా గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు.