: పట్టాలు తప్పిన హౌరా ఎక్స్ ప్రెస్.. ప్రయాణికులు క్షేమం
బెంగళూరు నుంచి హౌరా వెళుతున్న హౌరా ఎక్స్ ప్రెస్ నిన్న రాత్రి 10.30 గంటలకు చిత్తూరు జిల్లా కుప్పం రైల్వే స్టేషన్ దాటిన తర్వాత పట్టాలు తప్పింది. వెళ్లాల్సిన ట్రాక్ నుంచి వాడుకలో లేని ట్రాక్ లోకి రైలు మళ్లడంతో ఇంజన్ సహా నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. డ్రైవర్ వెంటనే రైలును నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. ఎవరూ గాయపడలేదు.