: వ్యాట్ ఎత్తివేతపై నెలాఖరులోగా నిర్ణయం: బొత్స


వ్యాట్ ఎత్తివేసే విషయంలో వస్త్ర వ్యాపారులకు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యన్నారాయణ, ఎంపీ లగడపాటి రాజగోపాల్ కొంత అభయమిచ్చారు. ఈ ఉదయం విజయవాడలోని వస్త్రలతలో వ్యాపారులతో వీరు భేటీ అయ్యారు. వ్యాట్ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి నెలాఖరులోగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అయితే, పెద్ద వ్యాపారులపై వ్యాట్ ఎత్తేయడం సరికాదని బొత్స సత్యన్నారాయణ మీడియాతో అన్నారు.

  • Loading...

More Telugu News