: నిబంధనలు ఉల్లంఘించే వారిపై క్రిమినల్ కేసులు: ట్రాఫిక్ పోలీసులు
నిబంధనలు ఉల్లంఘించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ట్రాఫిక్ అడిషనల్ సీపీ జితేందర్ తెలిపారు. హైదరాబాదులో రేపటి (బుధవారం) నుంచి స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్టు ఆయన చెప్పారు. నంబర్ ప్లేట్ల విషయంలో నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రికార్డుల్లో ఉన్న వివరాలకు, నంబర్ ప్లేట్లకు తేడా ఉంటే జరిమానా విధిస్తామని జితేందర్ చెప్పారు. స్పెషల్ డ్రైవ్ ల వల్ల దొంగ వాహనాలు పట్టుబడే అవకాశం ఉందని ట్రాఫిక్ అడిషనల్ సీపీ చెప్పారు.