: నేను నిరూపించుకోవాల్సిందేమీ లేదు: మాధురీ దీక్షిత్


నటిగా ఇప్పటికిప్పుడు నిరూపించుకోవాల్సిందేమీ లేదని బాలీవుడ్ అందాల నటి మాధురీ దీక్షిత్ తెలిపారు. 'దేఢ్ ఇష్కియా', 'గులాబ్ గ్యాంగ్' సినిమాలు ఆశించిన వసూళ్లు రాబట్టలేకపోయాయన్న విమర్శలకు ఆమె సమాధానమిస్తూ, కొత్త వారితో పోటీపడేందుకు తాను రీ ఎంట్రీ ఇవ్వలేదని అన్నారు. మంచి పాత్రలు చేసి అభిమానులను మెప్పించడమే తన లక్ష్యం తప్ప, ఇప్పుడు సాధించేందుకు ఏదీ లేదని మాధురీ తెలిపారు. 1990ల్లో బాలీవుడ్ ని ఓ ఊపు ఊపేసిన మాధురీ దీక్షిత్, శ్రీరామ్ నెనేని పెళ్లి చేసుకుని 47 ఏళ్ల వయసులో 'దేఢ్ ఇష్కియా'తో రీఎంట్రీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News