: సౌతాఫ్రికా టెస్టు జట్టు కెప్టెన్ ఆమ్లా
సౌతాఫ్రికా టెస్టు జట్టు కెప్టెన్ గా హషీం ఆమ్లాను నియమిస్తూ సీఎస్ఏ (క్రికెట్ సౌత్ ఆఫ్రికా ) నిర్ణయం తీసుకుంది. జోహెన్నెస్ బర్గ్ లో సమావేశమైన సెలక్టర్లు ఆమ్లాను కెప్టెన్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రిటైర్ అయిన గ్రేమ్ స్మిత్ స్థానంలో ఆమ్లాను కెప్టెన్ గా నియమించారు. గతంలో ఆమ్లాను కెప్టెన్ గా నియమించాలని ఆశించిన సెలక్టర్లకు, బ్యాటింగ్ పై దృష్టి పెట్టాలనుకుంటున్నానని బాధ్యతలు వద్దని ఆమ్లా సూచించాడు. స్మిత్ రిటైర్మెంట్ తరువాత ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. దీంతో ఆమ్లాను కెప్టెన్సీ వరించింది.