: విదేశీయులను హెచ్చరిస్తున్న ఖతార్
2022 ఫుట్ బాట్ ప్రపంచకప్ కు ఆతిధ్యమిస్తున్న గల్ఫ్ దేశం ఖతార్ స్వేచ్ఛ విషయంలో విదేశీయులను హెచ్చరిస్తోంది. ప్రపంచకప్ ఫుట్ బాల్ క్రీడను తిలకించడానికి వచ్చే విదేశీ అభిమానులకు మార్గదర్శకాలు నిర్ధేశించారు అక్కడి అధికారులు. మహిళలు సంప్రదాయబద్ధంగా ఉండాలని సూచిస్తూ అక్కడి అధికారులు పెద్ద ప్రచార ఉద్యమం చేస్తున్నారు. చెడ్డీలు, బికినీలు, నడుము, కాళ్లు ప్రదర్శించడం, స్లీవ్ లెస్ లు, మినీ స్కర్ట్ లు, లెగ్గింగ్ ల వంటి బిగుతైన దుస్తులు ధరించి పబ్లిక్ ప్రదేశాల్లో తిరగడం నిషేధం అంటూ ప్రచారం చేస్తున్నారు.
రోడ్డు మీద కౌగిలించుకోవడాలు, ముద్దులు పెట్టుకోవడం వంటివి చెల్లవుగాక చెల్లవని స్పష్టం చేస్తున్నారు. శరీరం మొత్తం కప్పుకుని ఉండడమే తమకు మర్యాద అని, రోమ్ లో ఉంటే రోమన్ లా ఉండాలని చెబుతున్నారు. అలాగే ఖతార్ లో ఉంటే ఖతార్ లా ఉండాల్సిందేనని అభిమానులకు ఖతార్ అధికారులు హెచ్చరిస్తున్నారు. హద్దు దాటినవారికి శిక్షలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.