: కోల్ కతా నైట్ రైడర్స్ విజయోత్సవ ర్యాలీ ఉద్రిక్తం
కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు విజయోత్సవ ర్యాలీ ఉద్రిక్తతలకు దారితీసింది. ఐపీఎల్ 7 టైటిల్ గెలుచుకున్న సందర్భంగా బీసీఏ (బెంగాల్ క్రికెట్ అసోసియేషన్) కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో సన్మాన కార్యక్రమం నిర్వహించింది. ఓపెన్ టాప్ బస్సులో స్టేడియంకి క్రికెటర్లు చేరుకోగా, ఉత్సాహంతో అభిమానులు క్రికెటర్లవైపు దూసుకువచ్చారు. అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. లాఠీఛార్జ్ లో పలువురు అభిమానులు గాయపడ్డారు.