: గోపీనాథ్ ముండే పోస్టుమార్టం రిపోర్టు
రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన కేంద్ర మంత్రి, దివంగత గోపీనాథ్ ముండే భౌతిక కాయానికి ఎయిమ్స్ వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేశారు. ప్రమాదంలో ముండే కాలేయానికి గాయాలైనట్టు నివేదికలో పేర్కొన్నారు. అకస్మాత్తుగా కారు ఢీ కొట్టడంతో పడిపోయిన ఆయన, షాక్ కు గురవ్వడంతో గుండె ఆగిపోయిందని వైద్యులు నివేదికలో నిర్ధారించారు.