: ముండే కారును ఢీకొన్న కారు డ్రైవర్ అరెస్ట్
కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే మృతి కేసులో... ఆయన ప్రయాణిస్తున్న కారును ఢీకొన్న ఇండికా కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉదయం ఢిల్లీ నుంచి ముంబై వెళ్లేందుకు ఇందిరాగాంధీ విమానాశ్రయానికి ముండే బయల్దేరారు. మార్గ మధ్యంలో ముండే ప్రయాణిస్తున్న మారుతి ఎస్ఎక్స్ 4 కారును పృథ్విరాజ్ రోడ్డు - తుగ్లక్ రోడ్డు జంక్షన్ వద్ద ఎర్ర సిగ్నల్ ను దాటి వచ్చిన ఇండికా కారు ఢీకొంది. ఈ ఘటనలో వెనుక సీటులో ఉన్న ముండే కిందకు పడిపోయారు. షాక్ కు గురైన ముండేకు గుండె పోటు వచ్చింది.
ఈ ప్రమాదానికి కారణమైన ఇండికా డ్రైవర్ గుర్జీందర్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నారు. అతడు ఇంపీరియల్ హోటల్ లో పనిచేస్తున్నట్టు సమాచారం.