: హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ పెరిగేలా చూడండి: జీహెచ్ఎంసీ అధికారులతో కేసీఆర్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారులతో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా కేసీఆర్ గ్రేటర్ హైదరాబాదు పరిధిలోని పలు సమస్యలపై అధికారులతో చర్చించారు. వర్షాకాలంలో నగరంలో ఎదురయ్యే సమస్యలు, పరిష్కార మార్గాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ జీహెచ్ఎంసీ అధికారులతో హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ పెరిగేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. ముఖ్యంగా సిటీలో తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థకు ఇబ్బంది రాకుండా చూడాలని ఆయన ఆదేశించారు.