: రండి... ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవండి: నాయిని


మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి సూచించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ టీఆర్ఎస్ పార్టీ నెరవేరుస్తుందని అన్నారు. మహిళల భద్రతకు టీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉందని నాయిని తెలిపారు. సీమాంధ్రులు తమ సోదరులని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్న ఆయన, ప్రభుత్వోద్యోగులు ఎక్కడివారు అక్కడే పని చేస్తే బాగుంటుందని అన్నారు.

పోలీసు సిబ్బంది సంఖ్య పెంచి భద్రతను కట్టుదిట్టం చేస్తామని ఆయన వెల్లడించారు. తెలంగాణ ఉద్యమకారులపై కేసుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన వివరించారు.

  • Loading...

More Telugu News