: గోపీనాథ్ ముండే భౌతికకాయానికి ప్రధాని మోడీ నివాళులు
ఢిల్లీలో ఇవాళ ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించిన కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఉంచిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ కార్యాలయానికి చేరుకుని ముండే భౌతికకాయం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. అనంతరం ఆయన ముండే కుటుంబ సభ్యులను పరామర్శించారు.