: వైఎస్సార్ కాంగ్రెస్ నేతల దీక్ష విరమణ


విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేపట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయలక్ష్మి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ ఉదయం నిమ్స్ ఆస్పత్రిలో తమ దీక్షను విరమించారు. సీనియర్ జర్నలిస్ట్ పొత్తూరి వెంకటేశ్వరరావు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. 5 రోజుల క్రితం హైదరాబాద్ లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చేపట్టిన దీక్షను నిన్న రాత్రి బలవంతంగా భగ్నం చేసిన పోలీసులు నిమ్స్ కు తరలించిన సంగతి తెలిసిందే. దీక్ష విరమణ అనంతరం విజయలక్ష్మి మాట్లాడుతూ తమ ఆందోళన కొనసాగుతుందని చెప్పారు. పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News