: 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుంది: టీసీఎల్పీ నేత జానారెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేతగా సీనియర్ నేత జానారెడ్డి ఎన్నికయ్యారు. దిగ్విజయ్ సింగ్ అధ్యక్షతన హైదరాబాదులోని గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది. ఈ సమవేశంలో సీఎల్పీ నేతగా జానారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీమాంధ్రలో పార్టీని ఫణంగా పెట్టి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వస్తుందని ఆయన తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రభుత్వానికి సహకరిస్తూ, నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని జానారెడ్డి స్పష్టం చేశారు.