: ఇది మోడీ వ్యక్తిత్వం


మేలు చేసిన వారిని మర్చిపోతున్న ప్రస్తుత తరుణంలో తనను ప్రధాని కావాలని కాంక్షిస్తూ లేఖ రాసిన అభిమానిని గుర్తుంచుకుని ప్రత్యుత్తరమిచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. సాధారణంగా ట్విట్టర్లో తన అభిమానులను ప్రస్తావించే మోడీ... దానికి భిన్నంగా ఆమెకు లేఖ రాశారు. అలీఘడ్ కు చెందిన స్నేహ గుప్తా అనే బాలిక ఎన్నికల ప్రచారం సందర్భంగా మోడీకి ఓ లేఖ రాసింది. మోడీ విజయం సాధించాలని తాను దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని, అందుకోసం ఉపవాసం కూడా ఉంటున్నానని ఆ లేఖలో పేర్కొంది.

ఎన్నికల అనంతరం మోడీ ప్రధాని కావడంతో ఆమె తన ప్రార్థన ఫలించిందని ఆనందించింది. ఇంతలో ఊహించని విధంగా ప్రధాని నుంచి ఆమెకు ప్రత్యుత్తరం వచ్చింది. స్నేహ శుభాకాంక్షలు అందుకున్నానని, ఆమె అభిమానానికి ధన్యవాదాలని లేఖలో మోడీ పేర్కొన్నారు. దేవుడి దయవల్ల ఆమె కలలన్నీ పండాయని ఆయన తెలిపారు. సాక్షాత్తూ దేశ ప్రధాని నుంచి ప్రత్యుత్తరం రావడంతో స్నేహ ఉబ్బితబ్బిబ్బవుతోంది.

  • Loading...

More Telugu News