: ఈ స్థూలకాయుడు 3 నెలల్లో 70 కిలోలు తగ్గాడుట
27 ఏళ్ల వయస్సులోనే విపరీతమైన స్థూలకాయం సమస్యతో బాధపడుతున్న ఓ కుర్రాడు ఆధునిక చికిత్సా విధానం.. గ్యాస్ట్రిక్ స్లీవ్ సర్జరీ ద్వారా కేవలం మూడు నెలల వ్యవధిలోనే 70 కిలోల బరువు తగ్గాడుట. ఎక్కడో కాదు.. మన దేశ రాజధానిలోనే ఈ చికిత్స చోటుచేసుకుంది. ఈ శస్త్రచికిత్సను స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అని కూడా పిలుస్తారు. ఇందులో సైడ్ ఎఫెక్టులు కూడా ఉండవని, ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్ టామ్ బాబు చెప్పారు.
ఢల్లీలోని న్యాయవాది ఆనియల్ సాబూ (కేరళైట్) 178 కిలోల బరువు ఉండేవాడు. దీనివల్ల అతనికి భౌతికంగా, మానసికంగా అనేక సమస్యలు ఎదురవుతుండేవి. అతను తమను సంప్రదించినప్పుడు ఢల్లీలోని సిల్వర్‌లైన్ ఆస్పత్రి వైద్యులు ఈ చికిత్స చేశారు.