: కర్నూలు జిల్లా వక్కెర వాగులో పడి ఇద్దరు మృతి, మరొకరు గల్లంతు


గత రెండు మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో కర్నూలు జిల్లాలోని వక్కెర వాగు పొంగి పొరలుతోంది. వాగు కొన్నిచోట్ల రహదారిపై ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో పరిసర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగు దాటే క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఓ బాలుడు, యువతి మరణించారు. మరో యువతి గల్లంతయ్యింది. గల్లంతైన యువతి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

  • Loading...

More Telugu News