: ఈ ఏడాది వృద్ధి రేటు 5 నుంచి 6 శాతం ఉంటుంది: ఆర్ బీఐ
2014-15 ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు 5 నుంచి 6 శాతం వరకు ఉంటుందని ఆర్ బీఐ అంచనా వేసింది. అలాగే వచ్చే జనవరి నాటికి ద్రవ్యోల్బణాన్ని 8 శాతానికి, 2016 నాటికి 6 శాతానికి నియంత్రించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రోజు ఆర్ బీఐ ద్రవ్యపరపతి సమీక్షను నిర్వహించింది. సమీక్షలో కీలక వడ్డీ రేట్ల (రెపో, రివర్స్ రెపో తదితర)ను యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది.