: డీజీపీ అనురాగ్ శర్మ... తెలంగాణ అల్లుడే


తెలంగాణ రాష్ట్ర తొలి డీజీపీ అనురాగ్ శర్మ తెలంగాణకు అల్లుడే! ఆయన భార్య మమతారెడ్డిది రంగారెడ్డి జిల్లా ఘట్ కేసర్ గ్రామం. ఆమె హైదరాబాదులోని ఆర్ బీవీఆర్ఆర్ మహిళా కళాశాలలో ఎంఎ తెలుగు పూర్తి చేశారు. అనురాగ్ శర్మ దంపతులిద్దరూ 1982లో ఐపీఎస్ కు ఎంపికయ్యారు. ఒకే బ్యాచ్ కు చెందిన వారిరువురి మధ్య పరిచయం ఆ తర్వాతి కాలంలో ప్రేమగా మారింది. 1985లో వీరి వివాహం జరిగింది.

శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత అనురాగ్ శర్మ, మమతారెడ్డిలకు వేర్వేరు రాష్ట్రాల్లో పోస్టింగ్ ఇచ్చారు. క్యాడర్ పరంగా అనురాగ్ శర్మ ఆంధ్రప్రదేశ్ కు, మమతారెడ్డిని పశ్చిమ బెంగాల్ కు కేటాయించారు. అనురాగ్ శర్మ దంపతులకు ఒక కూతురు, కొడుకు ఉన్నారు. కూతురు అమెరికాలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. కొడుకు అమెరికాలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. తనను కూడా ఏపీ కేడర్ కు బదలాయించమని ఆమె ప్రభుత్వాన్ని కోరినప్పటికీ, అది జరగలేదు. దాంతో ఆమె 2005లో ఐపీఎస్ కు రాజీనామా చేశారు.

  • Loading...

More Telugu News